ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అట్‌ 408

ABN, First Publish Date - 2020-06-18T11:32:13+05:30

జిల్లాలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం మరో 17 కేసులు నమోదు కాగా అఽధికారికంగా 14

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం మరో 17 కేసులు నమోదు కాగా అధికారికంగా 14 కేసులు ప్రకటించారు. మరో మూడు కేసుల వివరాలను గురువారం వెల్లడించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఉమాసుందరి తెలిపారు. అధికారికంగా జిల్లాలో కోవిడ్‌-19 బాధితులు సంఖ్య 408కి చేరుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రొద్దుటూరులో 2, చింతకొమ్మదిన్నెలో 2, పులివెందులలో ఒక కేసు నమోదయ్యాయి.


ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు కరోనా

సీకేదిన్నె: సీకేదిన్నె మండలంలోని ఎర్రమాచుపల్లె, రోడ్డుక్రిష్ణాపురం గ్రామాలకు చెందిన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు కరోనా సోకిందని మండల వైద్యాఽధికారి శైలజ తెలిపారు. వీరిలో ఒకరికి 45, మరొకరికి 57 సంవత్సరాలని.. వీరు భోపాల్‌ నుంచి రైలులో కడపకు జూన్‌ 14న వచ్చారని తెలిపారు. స్వాబ్‌ తీసి పరీక్షలకు పంపగా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారిద్దరినీ ఫాతిమా మెడికల్‌ కాలేజీకి తరలించామన్నారు. వీరి ప్రైమరీ కాంటాక్టుగా 19 మందికి, సెకండరీ కాంటాక్టు కింద 50 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించామన్నారు.


కోవిడ్‌-19 సమాచారం

మొత్తం శాంపిల్స్‌  - 51670

రిజల్ట్‌ వచ్చినవి  - 48510

నెగటివ్‌ - 48102

పాజిటివ్‌ - 408

డిశ్చార్జ్‌ అయినవారు - 152

రిజల్ట్‌ రావాల్సినవి - 3160

17వ తేదీ తీసిన శాంపిల్స్‌  - 1430

Updated Date - 2020-06-18T11:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising