ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్ర శిక్ష జిల్లా పీడీ

ABN, First Publish Date - 2020-08-10T11:18:38+05:30

కోవిడ్‌-19లో భాగంగా జీవనోపాధి కోల్పోయిన పేదలకు, వలస కూలీలకు సహకారాలు అందించినందుకు సమగ్ర శిక్షా జిల్లా పథక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాకర్‌రెడ్డికి అరుదైన గౌరవం


కడప (ఎడ్యుకేషన్‌), ఆగస్టు 9: కోవిడ్‌-19లో భాగంగా జీవనోపాధి కోల్పోయిన పేదలకు, వలస కూలీలకు సహకారాలు అందించినందుకు సమగ్ర శిక్షా జిల్లా పథక సంచాలకుడు అంబవరం ప్రభాకర్‌రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. జెనీవా దేశానికి చెందిన నీట్‌ ఆయోగ్‌ అనుబంధ సంస్థ అయిన నేషనల్‌ వర్చువల్‌ యూనివర్శిటీ ఫర్‌ పీస్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక డాక్టరేట్‌ను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగుళూరులో ఈనెల 15వ తేదీ భారతీయ విద్యాభవన్‌లో డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.


లాక్‌డౌన్‌లో పేదలు, వలస కూలీలకు సేవ చేయడంతో పాటు 2 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. యోగివేమన యూనివర్శిటీ క్వారంటైన్‌ సెంటన్‌ నోడల్‌ అధికారిగా ఉంటూ కొవిడ్‌ బాధితులకు సేవలు అందించారు. ఈయన సేవలను గుర్తించి యూనివర్శిటీ వారు డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవ చేసే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని  ఇందుకు అవకాశం కల్పించిన కలెక్టరు హరికిరణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-08-10T11:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising