ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులకు నష్టపరిహారం అందించాలి

ABN, First Publish Date - 2020-11-30T05:01:45+05:30

ప్రభుత్వ నిర్లక్ష్యానికి బుగ్గవంక ప్రాంతంలోని పేదలు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతరెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతరెడ్డి

కడప, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్లక్ష్యానికి బుగ్గవంక ప్రాంతంలోని పేదలు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం బుగ్గవంక బాధితులను కడప టీడీపీ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, వెంకటరెడ్డిలు వరద ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం ముంపునకు గురైన బాధితులకు భోజనం అందించారు. బుగ్గవంక గేట్లు ఎత్తేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు కన్నీరు మున్నీరుగా వాపోయారు. అనంతరం శ్వేతరెడ్డి, వెంకటరెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నివర్‌ తుఫాను హెచ్చరికలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడంతోనే ఈ విధంగా జరిగిందన్నారు. 2001లో బుగ్గవంక సంఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు పర్యటించి బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పరిహారం అందించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముంపునకు గురైన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల వరకు ఆర్థికసాయం అందించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-11-30T05:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising