ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియాంకకు జరిగిన అన్యాయంపై సీఎం స్పందించాలి

ABN, First Publish Date - 2020-12-30T05:24:50+05:30

రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డు లక్ష్మీపురంలో నివాసం ఉన్న ఎరుకుల కులానికి చెందిన ప్రియాంకకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఆదుకోవాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి

రాయచోటిటౌన్‌, డిసెంబరు29: రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డు లక్ష్మీపురంలో నివాసం ఉన్న ఎరుకుల కులానికి చెందిన ప్రియాంకకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఆదుకోవాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. మంగళవారం కోమాలో ఉన్న ప్రియాంకను కేవీపీఎస్‌ నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరాతీశారు.  అనంతరం ఎన్జీవో హోంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత, గిరిజన, మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. అగ్రకులానికి చెందిన వారు ఏం చేసినా చెల్లుతుందనే విధంగా వ్యవస్థలు తయారువుతున్నాయన్నారు.  బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీయం  జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఆవాజ్‌ కార్యదర్శి ఫయాజ్‌, సీఐటీయూ నాయకులు చెన్నయ్య, శివరాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising