ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీరోడ్డుకు నోచుకోని రాజీవ్‌ కాలనీ

ABN, First Publish Date - 2020-12-11T04:43:23+05:30

మండలంలోని గూడెం చెరువు రాజీవ్‌నగర్‌ కాలనీలో సిమెంట్‌ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతు న్నారు.

రాజీవ్‌నగర్‌ కాలనీలో ఉన్న మట్టిరోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 10: మండలంలోని గూడెం చెరువు రాజీవ్‌నగర్‌ కాలనీలో సిమెంట్‌ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతు న్నారు. ఆధునిక సాంకేతిక రంగం దూసుకెళ్తున్న తరుణంలోనూ ఇంకా చా లా గ్రామాలు మట్టి రోడ్లకే పరిమితం కావడం శోచనీయం. పల్లెలే పట్టుకొ మ్మలంటూ అభివృద్ధి అక్కడి నుంచే ప్రారంభమవుతుందటున్న పాలకులు ఇలా మట్టిరోడ్లతోనే మమ అనిపించడం ఏమిటంటూ పలువురు వాపోతు న్నారు. సుమారు 3,500 గృహాలు ఉన్న కాలనీలో ప్రధాన రోడ్డుకు సిమెంటు రోడ్లు తప్ప ఎక్కడ వీధుల్లో సిమెంటు రోడ్లు లేవని స్థానికుల ద్వారా తెలుస్తోంది. వర్షం వస్తే మోకాళ్లలోతు నీరు నిలబడడమే కాకుండా రోడ్లన్నీ కంకరతేలి నడవడానికి కూడా వీలులేకుండా పోతోంది. ప్రధాన రోడ్డు పక్క నుంచి కాలనీలోకి వెళ్లే దారులు కంపచెట్లు కప్పివేసి భయం భయంగా ఉన్నాయి. రాత్రి సమయాల్లో ఆ దారిన వెళ్లాలన్నా, బయటికి రావాలన్నా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలాగే రాత్రి సమయాల్లో అక్కడక్కడ వీధిలైట్లు పడటంలేదని స్థానికులు వాపోతున్నారు. రాజీవ్‌నగర్‌ కాలనీ నగరపంచాయతా లేక మోరగుడి గ్రామ పంచాయతీ తేల్చి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించండి

జమ్మలమడుగు మండలంలో పలు గ్రామాల్లో మంచినీటి సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీళ్లు వదలడంతో సమీప గ్రామాల ప్రజలు మంచినీటితో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. సుమారు మూడు నెలల నుంచి నీటి సమస్యలు ఉన్నప్పటికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మం డలంలోని దానవులపాడు, గూడెం చెరువు రాజీవ్‌నగర్‌ కాలనీ, గ్రామదేవత చుట్టుపక్కల ఇళ్లకు మంచినీటి సమస్య ఉంది. దానవులపాడులో మూడు నెలల నుంచి ట్యాంకర్ల ద్వారా ప్రజలు నీళ్లను పట్టుకుంటున్నారు. ఇళ్లవద్ద కుళాయిలు ఉన్నప్పటికి నిరుపయోగంగా మారాయని పరిష్కరించాల్సిన అధికారులు తమ గ్రామంవైపు రావడంలేదన్నారు. పెన్నా నీటి వల్ల తాగునీ టి మోటార్లు నీటిలో మునిగిపోవడంవల్లే సమస్యలు ఉత్పన్నమ య్యాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-11T04:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising