ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్టాండ్‌కు వెళ్లాలంటేనే హడల్‌

ABN, First Publish Date - 2020-12-12T05:07:50+05:30

పాలకులుమారినా... ప్రభుత్వాలు మారినా ఎర్రగుంట్ల బస్టాండు కష్టాలు మాత్రం తీరడంలేదు.

బస్టాండు సెంటర్‌లో గుంతల్లో నిలిచిన వర్షపునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, డిసెంబరు 11: పాలకులుమారినా... ప్రభుత్వాలు మారినా ఎర్రగుంట్ల బస్టాండు కష్టాలు మాత్రం తీరడంలేదు. వర్షం వస్తేచాలు బస్టాండు ఆవరణమంతా గుంతల్లో నీరు నిలిచి ప్రయాణికులు, ఆటోలు సైతం వెళ్లడాని కి వీలులేకుండా ఉంటోంది. ఇక దూర ప్రాంతాలకు వెళ్లడానికి బస్సుల కోసం బస్టాండుకు రావాలంటే వృద్ధులు, మహి ళలు, చిన్నారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. గుంతల్లో నిలిచిన నీటితో భరించరాని కంపు కొడుతోందని స్థానికులు వాపోతున్నారు.  బస్టాండులో  ప్రయాణికులకు కూర్చునేందుకు సరైన వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  బస్సులు లోపలికి వచ్చే మలుపులో  ముందుబాగం మడ్కార్‌లు తగుతుండటంతో డ్రైవర్లు బస్టాండు లోపలికి రాకుండా బయట నుంచే వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రయాణికు లు బస్సులు ఎక్కడానికి ఉరుకులు, పరుగులు చేయాల్సి వస్తోంది.  ప్రయాణికుల రద్దీ బారీగా పెరగడంతో కూర్చునేందుకు బెంచీలు లేక గంటల తరబడి బస్సుల కోసం లగేజీలతో ప్రయాణికులు చంటిబిడ్డలను ఎత్తుకుని మహిళలు  చెట్లకిందనే నిలబడాల్సి వస్తోంది. ఇక బస్టాండు స్థలం రోజురోజుకు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే నాథు డే కరువయ్యారు.  దాతలు ఇచ్చిన బెం చీలను సైతం కొందురు మాయం చేస్తున్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు నాయకులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కాని నేడు అధికారంలోకి వచ్చి 18నెలలు అయినా బస్టాండు అభివృద్ది అలా వుంచితే కనీసం బురదనీరు ఆగకుండా, చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.  ఎవరు అధికారంలోకి వచ్చి నా ఇంతేనా అంటూ ప్రజలు తీవ్ర ఆసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు బస్టాండు సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలి

ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండు సమస్యపై యాజమాన్యం స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణలు జరుగుతున్నా, గుంతలమయమైనా, దుర్వాసన వెదజల్లుతున్నా ప్రయాణికుల సమస్యలను తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయ మై ఆర్టీసీ కంట్రోలర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా విషయాన్ని ప్రొద్దుటూరు ఆర్టీసీ డీపోమేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లగా తాను కడప ఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 



Updated Date - 2020-12-12T05:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising