ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2020-12-02T04:43:56+05:30

తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న శశిభూషణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి


కడప (మారుతీనగర్‌), డిసెంబరు 1: తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగ ళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు పక్షపాత ప్రభుత్వం తమదంటూ గొప్పలు చెప్పుకునే జగన్‌ ప్రభుత్వం పాడైన పంటలను అంచనా వేయడంలో సైతం పూర్తిగా చేతులెత్తేయడం దారుణమన్నారు. ముఖ్యంగా పంట నష్టపరిహారం ప్రతీ రైతుకు అందేలా చూడాలన్నారు. లేదంటే పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. బుగ్గవంక డ్యాం నుంచి వరద నీరు వదులుతున్నట్లుగా ముందస్తు సమాచారాన్ని నగర ప్రజలకు తెలుపకుండానే గేట్లు ఎత్తివేయడం సరైంది కాదన్నారు. ఇప్పటీకీ వరద తాకిడికి గురైన ప్రాంతాలు బురదమయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లుగా ఉండడం విచారకరమన్నారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో ఇద్దరు అర్చకులపై వైసీపీనాయకుడు, ఆ ఆలయ చైర్మన్‌ దాడికి తెగబడడం ఆయన రాక్షసత్వానికి పరాకాష్ట అన్నారు. తక్షణమే ప్రభుత్వం భేషరతుగా అర్చకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  సమావేశంలో బీజేపీ సీనియర్‌ నాయకులు వి.వి.చలపతి, శ్రీరంగప్రసాద్‌, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising