ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన వైద్యసేవలందించాలి

ABN, First Publish Date - 2020-07-06T10:18:25+05:30

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవిడ్‌ ఆసుపత్రిని అకస్మికంగా తనిఖీ చేసిన జేసీ సాయికాంత్‌ వర్మ


కడప(కలెక్టరేట్‌) జూలై 5 : ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ తెలిపారు. గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కాలలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ ఆసుపత్రిని శిక్షణ కలెక్టర్‌ వికాస్‌ మర్మాట్‌తో కలసి జేసి ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌, శిక్షణ కలెక్టర్లు పీపీఈ సూట్‌ ధరించి ఆసుపత్రి మొత్తాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పేషంట్లకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.


అలాగే అక్కడ వారికి అందుతున్న సేవలను, వసతులపై ఆరా తీశారు. అనంతరం వివిధ అంశాలపై వైద్యులతో సమీక్షించి సూచనలు చేశారు. కరోనా పేషంట్లకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. అలాగే ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో  రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసాదరావు, టీజీపీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటరెడ్డి, డీఎంవో డాక్టర్‌ మస్తానీ, వైద్యులు, నర్సులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T10:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising