‘అర్హత ఉన్న ఆయాలకు పదోన్నతుల్లో ఇబ్బందులు’
ABN, First Publish Date - 2020-12-12T05:27:29+05:30
జమ్మలమడుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అర్హత కలిగిన ఆయాలకు పదోన్నతుల్లో సంబందిత అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ప్రసాద్, పట్టణ కార్యదర్శి మహమ్మద్‌రఫిలు ఆరోపించారు.
జమ్మలమడుగు రూరల్, డిసెంబరు 11: జమ్మలమడుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అర్హత కలిగిన ఆయాలకు పదోన్నతుల్లో సంబందిత అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ప్రసాద్, పట్టణ కార్యదర్శి మహమ్మద్‌రఫిలు ఆరోపించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రమోషన్లలో అర్హులైన ఆయాలకు పదోన్నతులు కల్పించకుండా అర్హత లేనివారికి ప్రమోషన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి అర్హులైనవారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనర్హులకు ప్రమోషన్లు ఇవ్వడంపై సిట్టింగ్ జడ్జిచేత విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:27:29+05:30 IST