ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు ఆయుధాల గురించి తెలుసుకోవాలి

ABN, First Publish Date - 2020-10-23T11:43:00+05:30

పోలీసులు విధి నిర్వహణలో వాడే ఆయుధాల గురించి విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో అవసరమని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఖాసింసాహెబ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓపెన్‌ హౌస్‌ ఎగ్జిబిషన్‌లో ఏఎస్పీ ఖాసింసాహెబ్‌


కడప (క్రైం), అక్టోబరు 22 : పోలీసులు విధి నిర్వహణలో వాడే ఆయుధాల గురించి విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో అవసరమని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఖాసింసాహెబ్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గురువారం పోలీసు కార్యాలయంలోని పెరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ ఎగ్జిబిషన్‌ను జిల్లా అదనపు ఎస్పీలు ఖాసింసాహెబ్‌, దేవప్రసాద్‌లు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొని ఆసక్తిగా తిలకించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వారు వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేర దర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్థులకు తెలిపేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 24వ తేదీ వరకు ఓపెన్‌హౌస్‌ నిర్వహిస్తామని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం బాంబు డిస్పోజబుల్‌ టీం, ఫింగర్‌ప్రింట్‌, పోలీసు కంట్రోల్‌ రూం, కమ్యూనికేషన్స్‌, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు, ఆయుధాల-విడిభాగాల సమాచారం గురించి విద్యార్థులకు తెలిపారు. బాడీవార్మ్‌ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల గురించి తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ వంశీధర్‌, ఆర్‌ఐ శ్రీనివాసులు, ఆర్‌ఎ్‌సఐ వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 


ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు

జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ ఎగ్జిబిషన్‌లో పలు రకాల ఆయుధాలు ప్రదర్శనగా ఉంచారు. 22 రైఫిల్‌, 410 మస్కట్‌, 303 రైఫిల్‌, 762 ఎంఎం ఎస్‌ఎల్‌ఆర్‌, ఏకే 47, 5.56 ఎంఎం (ఇన్సాస్‌), 12 బోర్‌ పంప్‌ యాక్సన్‌ గన్‌, 9 ఎంఎం కార్బన్‌, 380 రివాల్వర్‌, 9 ఎంఎం పిస్టల్‌, 9 ఎంఎం గ్లాక్‌, వీఎల్‌ పిస్టల్‌, ప్రొటెక్టర్‌ ఫైరోటిక్‌, 12 బోర్‌ పంప్‌ యాక్సన్‌ గన్‌, ఎల్‌ ఎంజీ 51 ఎంఎం మోటారు, హెచ్‌ఈ 36 గ్రనేడ్‌ తదితర ఆయుధాలు ప్రదర్శనలో ఉంచారు.

Updated Date - 2020-10-23T11:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising