ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి సీఎంగా జగన్‌ అవసరమా!

ABN, First Publish Date - 2020-09-21T10:26:07+05:30

రాష్ట్రానికి సీఎంగా జగన్‌ అవసరమా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనరంజకంగా మోదీ పాలన

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి


కడప (మారుతీనగర్‌), సెప్టెంబరు 20 : జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై, హిందూ దేవాలయాలపై దాడులు పెచ్చుమీ రాయని... ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా.... ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు. నరేంద్రమోదీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సపా ్తహం కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి పనతల సురేష్‌ ఆధ్యర్యంలో ఆదివారం స్థానిక వైఎస్‌ఆర్‌ ఆడిటోరియంలో పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఆదినారాయణరెడ్డి హాజరై మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధితో దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న ప్రధాని నరేంద్రమోదీ సాగిస్తున్న పాలన జనరంజకంగా ఉందని కొనియాడారు.  కేంద్రం ఇచ్చే నిధులతో సోకులు చేసుకోవడం తప్ప జగన్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కనీసం మానవత్వంతో పారిశుధ్య కార్మికులకు నెలనెలా ఇచ్చే వేతనాలను సక్రమంగా ఇవ్యకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.యల్లారెడ్డి, నాయకులు జయరాములు, జనసేన రాయలసీమ ఇన్‌చార్జ్‌ సుంకర శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు కె.వి.చలమారెడ్డి, గోసుల శ్రీనివాసులురెడ్డి, వి.వి.చలపతి, లక్ష్మీదేవి, బీజేవైఎం నాయకులు బొమ్మన విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-21T10:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising