ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి తెరుచుకోనున్న ప్రభుత్వ పాఠశాలలు

ABN, First Publish Date - 2020-09-21T10:23:10+05:30

నేటి నుంచి తెరుచుకోనున్న ప్రభుత్వ పాఠశాలలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1 - 8 తరగతుల విద్యార్థులకు అనుమతి లేదు

తల్లిదండ్రుల అనుమతితో 9 - 10 తరగతుల విద్యార్థులు పాఠశాలకు


కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 20: డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూలు ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే ఉపాధ్యాయులు మాత్రం వంద శాతం హాజరు కావాల్సి ఉంటుంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు అనుమతిని ప్రభుత్వం నిషేధించింది. 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రం తల్లిదండ్రుల రిక్వెస్ట్‌ లెటరుపై హాజరు కావచ్చని సూచించింది. జిల్లాలో 4449 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 88, ఎయిడెడ్‌ 137, పురపాలక 89, కేంద్ర ప్రభుత్వ 2, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ 3202 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోన్నాయి. కొవిడ్‌-19లో భాగంగా విద్యార్థుల హాజరుపై కొన్ని ఆంక్షలను విధించింది. తొలిరోజు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ వంద శాతం హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 22వ తేదీ నుంచి ప్రతిరోజూ 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.

Updated Date - 2020-09-21T10:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising