ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు

ABN, First Publish Date - 2020-09-21T10:22:31+05:30

ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 20: గ్రామ సచివాలయ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టరు హరికిరణ్‌ తెలిపారు. 76 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 31,907 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 24,284 మంది (76.09 శాతం) హాజరయ్యారు. 7623 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో 18,479 మందికి గాను 14,080, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో 13,428 మంది హాజరు కావాల్సి ఉండగా 10,204 హాజరయ్యారని తెలిపారు. అలాగే ఉదయం, మధ్యాహ్నం జరిగిన మొదటిరోజు పరీక్షల్లో ఆరుగురు కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వారు, ఆరుగురు పాజిటివ్‌ అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు. అలాగే 8 మంది అభ్యర్థులు స్రైబ్‌ సహాయంతో పరీక్షలు రాశారన్నారు. 


పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన జేసీ 

గ్రామ, వార్డు సచివాల య ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణను జాయింట్‌ కలెక్టరు సాయికాంత్‌వర్మ పరిశీలించారు. కడప నగరంలోని పలు కేంద్రాలతో పాటు వల్లూరు మండలంలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.


కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షణ

కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును జేసీ ధర్మచంద్రారెడ్డి ఆదివారం పరిశీలించారు. జిల్లాలో మొదటి రోజు పరీక్షలు ఏర్పాటు చేసిన కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయుచోటి, పులివెందుల క్లస్టర్లలో ఉన్న పరీక్ష కేంద్రాల్లో నియమితులైన చీఫ్‌ సూపరింటెండెంట్లతో మాట్లాడి హాజరు వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీపీవో తిప్పేస్వామి, గ్రౌండ్‌ వాటర్‌ డీడీ మురళి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T10:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising