ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయం..భయం..

ABN, First Publish Date - 2020-06-28T07:12:22+05:30

కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులను చూసి జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో 54 మందికి పాజిటివ్‌

రెండు రోజుల వ్యవధిలో 183 కేసులు నమోదు

840కి చేరిన కేసుల సంఖ్య


కడప, జూన్‌ 27 : కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులను చూసి జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. తొలుత పట్టణాలకు పరిమితమైన మహమ్మారి ఇప్పుడు గ్రామాల్లోకి విస్తరించేసింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 183 మంది వైరస్‌ బారిన పడ్డారు. శనివారం ఒక్క రోజే 54 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. అనధికారికంగా ఇదే స్థాయిలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు. కడప, పులివెందుల పట్టణాలు కేసుల నమోదులో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెద్ద ఎత్తున నమోదు కావడంతో అక్కడ కట్టడి కోసం కొత్తగా మరో 31 కంటైన్మెంటు జోన్లు ఏర్పాటు చేశారు.


శనివారం నమోదైన కేసులను పరిశీలిస్తే.. కడపలో ఎస్పీ బంగ్లా నుంచి నెహ్రూ పార్కు వరకు 15 కేసులు, రాజారెడ్డివీధిలో 2, నబీకోటలో 2, రాజంపేట రోడ్డులోని ఓ కల్యాణ మండపం ప్రాంతంలో ఒక కేసు నమోదైంది. మైలవరం మండలంలో 2, మైదుకూరు 3, ఎర్రగుంట్ల 2, ప్రొద్దుటూరు 4, వేముల 3, అట్లూరు 1, ముద్దనూరు 10, రాజంపేట 1, కొండాపురం 1, పెండ్లిమర్రి 1, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఆరు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 840కి చేరింది. 


26మంది డిశ్చార్జి

కరోనా బారిన పడి కడపలోని జిల్లా కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది 26 మంది శనివారం డిశ్చార్జి అయినట్లు కలెక్టరు హరికిరణ్‌ వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన 10 మంది, కడపకు చెందిన ఇద్దరు, విదేశాల నుంచి వచ్చిన 14 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. ఇప్పటివరకు మొత్తం 333 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు.


31 కంటైన్మెంటు జోన్లు ఏర్పాటు

జిల్లాలో ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టడి చర్యలు తీసుకునేంఉదకు గాను 31 కంటైన్మెంటు జోన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టరు హరికిరణ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కడపలోని బెల్లంమండీవీధి, కుమ్మరికుంట, శంకరాపురం, ఎన్జీవోకాలనీ, ఓంశాంతినగర్‌, పులివెందుల అర్బన్‌లోని పాతబస్టాండు ప్రాంతం, బొగ్గుడుపల్లె, అమ్మవారిశాలవీధి, ఓంశాంతివీధి రాఘవేంద్ర థియేటరు వీధి, ఎస్‌బీఐ కాలనీ, బ్రాహ్మణపల్లె, బద్వేలు అర్బన్‌ పరిధిలోని వల్లెలవారిపల్లె హరిజనవాడ, మైదుకూరు అర్బన్‌లోని ప్రొద్దుటూరు రోడ్డు, బద్వేలు మండలంలోని బయనపల్లె, ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె, సింహాద్రిపురం మండలంలోని సీఎ్‌సఐ చర్చి ఎదురు వీధి కంటైన్మెంటు జోన్‌ పరిధిలోకి వచ్చాయి.


అలాగే వల్లూరులో హరిజనవాడ, పుల్లంపేటలోని నాగులగట్టు, పెద్దముడియం మండలంలో పెద్దపసుపుల, పోరుమామిళ్ల మండలంలో వాసుదేవపురం, వీరబల్లె మండలంలో కుమ్మరపల్లె, నందలూరులో నాగిరెడ్డిపల్లె, ముద్దనూరులో శెట్టివారిపల్లె, చాపాడు మండలంలో టీచర్స్‌ కాలనీ, కలసపాడు మండలంలో బ్రాహ్మణపల్లె, ఖాజీపేట మండలంలో మూలవారిపల్లె, సంబేపల్లె మండలంలో ఎగువరాచపల్లె, చక్రాయపేట మండలంలోని కల్లూరుతాండా, వేములను కంటైన్మెంటు జోన్‌లుగా ఏర్పాటు చేశారు.


కరోనా అప్‌డేట్స్‌

మొత్తం శాంపిల్‌్స్‌ - 66455

రిజల్ట్‌ వచ్చినవి - 62685

నెగటివ్‌ - 61845

పాజిటివ్‌ - 840

పెండింగ్‌ - 3770

27న తీసిన శాంపిల్స్‌ - 2012

డిశ్చార్జి - 333


Updated Date - 2020-06-28T07:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising