ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాడు - నేడు’ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ప్రభాకర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-09-26T07:00:16+05:30

జిల్లాలో నాడు - నేడు పాఠశాలలను పూర్తి స్థాయిలో అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నాడు - నేడు’ పనుల్లో 

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

 సమగ్ర శిక్ష పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి


కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 25: జిల్లాలో నాడు - నేడు పాఠశాలలను పూర్తి స్థాయిలో అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని సమ గ్ర శిక్ష పథక అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. కడప నగరం సమగ్ర శిక్ష కార్యాలయంలో శుక్రవారం నాడు-నేడు పనులపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 5లోపు పూర్తి స్థాయిలో పనులు పూర్తి కావాలన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలకు సంబంధించి రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌ చేసి త్వరితగతిన తీసుకురావాలన్నారు. ఎస్టిమేషన్‌లో పాఠశాలలకు అవసరమయ్యే మినరల్‌ వాటర్‌ప్లాంటు, ల్యాబ్‌, లైబ్రరీ తదితర వాటని నమోదు చేయాలని సూచించారు.


ప్రధానంగా ఇంజనీరింగ్‌ శాఖ వారు పాఠశాలల మౌలిక వసతులతో పాటు విద్యాభ్యాస ప్రక్రియకు అవసరమైన అన్ని వసతులు ఎస్టిమేషన్‌లో పొందుపరచాలని తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ సుందరరాజు, డీఈ చంద్రశేఖరన్‌, సైట్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T07:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising