అమరావతే ఏకైక రాజధాని : టీడీపీ
ABN, First Publish Date - 2020-12-18T05:05:33+05:30
అమరావతే రాషా్ట్రనికి ఏకైక రాజ ధాని అని బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్ ఓ బుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు.
బద్వేలు, డిసెంబరు17: అమరావతే రాషా్ట్రనికి ఏకైక రాజ ధాని అని బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్ ఓ బుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి పోరాటం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భం గా అమరావతి జనభేరికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏడాదిగా అమరావతి రైతుల రోదన ముఖ్యమంత్రి జగనరెడ్డికి వినపడకపోవడం దురదృష్టకరమన్నారు. అన్నదాతకు సంకెళ్లు వేయడమేనా జగన తెస్తు న్న రైతురాజ్యం అని ప్రశ్నించారు.
28వేలమంది రైతులు శాంతియుత ఉద్యమం చేయడం రైతులకు ఉన్న ఓపిక, పట్టుదలకు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఎస్సీ రైతులపైనే అట్రాసిటి కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వం మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. అమరావతి రైతుపై వైసీపీ ప్రభు త్వం కక్షగట్టారని ఆయన ఆరోపించారు. అమరావతి విధ్వంసంతో రాష్ట్ర భవిష్యత్తును ధ్వంసం చేశారన్నారు. రైతు కష్టాలను, ఆత్మహత్యల ను అపహాస్యంచేస్తూ మంత్రులు మాట్లాడడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు ఝాన్సీ, అశోక్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-18T05:05:33+05:30 IST