ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా అగస్త్యేశ్వరస్వామి కల్యాణం

ABN, First Publish Date - 2020-12-14T04:56:11+05:30

మాస శివరాత్రిని పురష్కరించుకుని అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో గంగాగౌరీ సమేత శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

గంగాగౌరీ సమేత అగస్త్యేశ్వరుని కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 13: మాస శివరాత్రిని పురష్కరించుకుని అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో గంగాగౌరీ సమేత శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరిదేవి అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన నిర్వహించి స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో రుద్రహోమం నిర్వహించారు. సాయంత్రం కాలక్షేప మండపంతో గంగాగౌరీ అగస్త్యేశ్వరస్వాములను ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. సుముహూర్తంలో వేదపండితుల మత్రోచ్చారణల మధ్యా స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల య ఛైర్మన్‌ రాంప్రసాద్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు, ఈవో రామచంద్రాచార్యులు పాల్గొన్నారు.

వైభవంగా భద్రావతి, భావనారుషి  కల్యాణం

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 13: రామేశ్వరంలోని భద్రావతి భావనారుషి స్వామి ఆలయం, శ్రీరాంనగర్‌లోని భద్రావతి, భావన్నారుషి స్వామి ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణంను నిర్వహించారు. కరోనా నిబంధనల ప్రకారం భక్తులను కల్యాణంను తిలకించడానికి అనుమతించా రు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:56:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising