ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-11-16T05:00:37+05:30

మండల పరిధిలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై శనివారం బుడ్డారెడ్డిగారిపల్లె వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శేఖర్‌ (35) మృతి చెందాడు.

శేఖర్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబేపల్లె, నవంబరు15: మండల పరిధిలోని కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై శనివారం బుడ్డారెడ్డిగారిపల్లె వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శేఖర్‌ (35) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... తెలంగాణా రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని హనుమాన్‌నగర్‌కు చెందిన శేఖర్‌, వరంగల్‌ జిల్లా సిరిగిరిటౌన్‌కు చెందిన అనిల్‌ హైదరాబాద్‌లో డిజిటల్‌ బోర్డుల తయారీ కంపెనీలో పనిచేసేవారు. ఈనెల 7వ తేదీ ఇరువురు కలిసి టాటా మ్యాజిక్‌ ఆటోలో కర్నూలు, అనంతపురం, ఆళ్లగడ్డలో ఫ్లెక్సీలు బిగించారు. అనంతరం చిత్తూరుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సంబేపల్లెలో పెట్రోల్‌ బంక్‌ వద్ద వాహనం ఆపి విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్‌ శనివారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డుపైకి రాగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. శేఖర్‌ ఎంతసేపటికీ రాకపోవడంతో అనిల్‌ రోడ్డు వెంబడి వెళ్లి చూడగా అతను మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-11-16T05:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising