ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాలపై మిడతల దండు

ABN, First Publish Date - 2020-08-12T05:30:00+05:30

గుంపులుగా చేరి పశుగ్రాసాన్ని తినేసే మిడతల దండు మైదుకూరు మున్సిపల్‌ పరిధిలోని యల్లంపల్లె ప్రాంతంలో కన్పించింది. పంటలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

ఆప్రమత్తమైన అధికారులు


మైదుకూరు రూరల్‌, ఆగస్టు 12: గుంపులుగా చేరి పశుగ్రాసాన్ని తినేసే మిడతల దండు మైదుకూరు మున్సిపల్‌ పరిధిలోని యల్లంపల్లె ప్రాంతంలో కన్పించింది. పంటలపై మిడతల దండు దాడిచేస్తోందంటూ కొన్ని నెలల క్రితం తెలంగాణ, అనంతపురం జిల్లాలో రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో మిడతల దండు మంగళవారం మైదుకూరు సమీపంలోని యల్లంపల్లెలో రైతు నాగప్రసాద్‌రెడ్డి పొలంలో కన్పించింది. దీంతో రైతు ఆందోళన చెంది వ్యవసాయాధికారులకు తెలియజేయడంతో బుధవారం ఏడీఏ క్రిష్ణమూర్తి, ఏవో లక్ష్మి ప్రసన్న, శాస్త్రవేత్తలతో కలసి పొలాన్ని సందర్శించారు.


ఇతర ప్రాంతాల్లో మిడతల దండు కన్పించలేదని వారు తెలిపారు. మిడతల నివారణకు క్లోరిఫైరిఫాస్‌ లీటరు నీటికి 2.5 మి.లీ కలిపి పిచికారి చేయాలని, 500 మి.లీ డీడీవీపీ 76 ఈసీ 500 మి.లీ నీటిలో 100 కిలోల ఇసుకను కలిపి పైరు మీద ఉదయం 7 నుంచి 10 గంటల్లోపు, సాయంత్రం పూట చల్లాలని రైతులకు సూచించారు.

Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising