ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

62,115 మందికి రూ 62.11 కోట్లు

ABN, First Publish Date - 2020-11-26T05:05:17+05:30

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలో 62,115 మందికి రూ.62.11 కోట్లు లబ్ధి చేకూరిందని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పేర్కొన్నారు.

లబ్ధిదారులకు చెక్‌ను అందిస్తున్న అంజద్‌బాషా, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప(కలెక్టరేట్‌), నవంబరు 25: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలో 62,115 మందికి రూ.62.11 కోట్లు లబ్ధి చేకూరిందని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, సంబంధిత ముఖ్య కార్యదర్శులతో కలసి జగనన్న తోడు పథకాన్ని సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌, జేసీ సాయికాంత్‌ వర్మలు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం రూ.62.11 కోట్ల మెగా చెక్కును వారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో చిరు వ్యాపారులు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జగనన్న తోడు పథకం ద్వారా చిరువ్యాపారులకు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 వేలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో సీఎం చిత్రపటానికి ప్రజాప్రతినిధులు పాలభిషేకం చేశారు. కాగా కడప వైఎ్‌సఆర్‌ ఆడిటోరియంలో బుధవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌, మెప్మా ఆధ్వర్యంలో జగనన్న తోడు, ప్రధానమంత్రి సన్నిధి పథకాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజరు చంద్రశేఖర్‌, మెప్మా పీడీ రామ్మోహన్‌ రెడ్డి, ఏపీడీలు సుబ్రమణ్యం, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising