ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు

ABN, First Publish Date - 2020-03-31T10:17:33+05:30

స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్ధిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గ్రామ పంచాయతీలకు రూ.51.61 కోట్లు 

మున్సిపల్‌ కార్పోరేషన్లకు రూ.47.87 కోట్లు విడుదల 


కడప, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్ధిక సంఘం నిధులు రావంటూ జగన్‌ సర్కార్‌ నానా యాగీ చేసింది. నిధులు అడ్డుకునేందుకే టీడీపీ ఎన్నికల కమిషన్‌ కలిసి కుట్ర పన్నుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. కాగా ఇవేవీ నిజం కాదంటూ 2019-20 ఆర్ధిక సంవత్సరంలో మొదటివిడతగా నిధులను కేంద్రం ఉదారంగా మంజూరు చేసింది. జిల్లాలో 14వ ఆర్ధిక సంఘం గ్రామ పంచాయతీలకు రూ.51.61 కోట్లు, మున్సిపల్‌ కార్పోరేషన్‌, నగర పంచాయతీలకు రూ.47.87 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


తాగునీరు, పారిశుధ్యం, రహదారులకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. మున్సిపల్‌, కార్పోరేషన్‌, నగర పంచాయతీల వారీగా మొదటి విడత నిధులు పరిశీలిస్తే..  కడప కార్పొరేషన్‌, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల కలిపి మొత్తం - రూ.42,04,63,780 మంజూరయ్యాయి. గ్రామపంచాయతీలకు సంబంధించి రూ.47.87కోట్లు నిధులు మంజూరు అయ్యాయి.  

Updated Date - 2020-03-31T10:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising