కడపలో టీడీపీ నేత దారుణ హత్య
ABN, First Publish Date - 2020-12-29T17:17:38+05:30
ప్రొద్దుటూరులో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు.
కడప: ప్రొద్దుటూరులో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు ఇళ్ళపట్టాల పంపిణి కార్యక్రమం వద్ద అందరు చూస్తుండగా దుండగులు సుబ్బయ్యను నరికి చంపారు. హతుడు సుబ్బయ్య, అధికారపాలర్టీ శ్రేణులు ఇటీవల అసాంఘిక కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా వరుసగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చే ఫ్లాట్లలోనే సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Updated Date - 2020-12-29T17:17:38+05:30 IST