జడ్జి రామకృష్ణ అరెస్ట్
ABN, First Publish Date - 2020-12-11T22:31:14+05:30
జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్జి రామకృష్ణపై మదనపల్లె పోలీస్‌స్టేషన్‌లో కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. రామకృష్ణ పిన్నమ్మ
అమరావతి: జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్జి రామకృష్ణపై మదనపల్లె పోలీస్‌స్టేషన్‌లో కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. రామకృష్ణ పిన్నమ్మ చనిపోయిన తర్వాత కూడా ఆమె పెన్షన్‌ను.. ఫోర్జరీ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడని బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో జడ్జి రామకృష్ణ, ఆయన సోదరుడు రామచంద్రపై దండగులు దాడి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే దాడి చేశారని రామకృష్ణ ఆరోపించారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, దళిత సంఘాలు ఖండించాయి. అంతేకాదు రామకృష్ణ అండగా నిలిచాయి. జడ్జి రామకృష్ణ కుటుంబంపై మంత్రి పగబట్టారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జడ్జి రామకృష్ణ రోడ్డుపైకి రావద్దని తహసీల్దార్ నిషేదాజ్ఞలు విధించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
గతంలో జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను బీ.కొత్తకోట పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు ఆధారంగా రామచంద్రను విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. భూ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండగా కావాలనే ఈ కేసులో మహిళలను రప్పించి అక్రమంగా కేసులు బనాయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని రామచంద్ర అన్న జడ్జి రామకృష్ణ ఆరోపించారు.
Updated Date - 2020-12-11T22:31:14+05:30 IST