ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టినందుకు అరెస్టు చేస్తారేమో: జేసీ ప్రభాకర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-10-21T20:32:06+05:30

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏం చేయకపోయినా కేసులు పెట్టి లోపల వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రానికి మరో రాష్ట్రానికి న్యాయంలో తేడా ఉందని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా కేసు వేశారుని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయన్న ఆయన.. 28 శాతం జీఎస్టీ చెల్లించి వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఉంటుంది కనుకే.. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో తాము వాహనాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. అయినా అధికార పార్టీకో న్యాయం.. తమకో న్యాయమా అని ప్రశ్నించారు. ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టినందుకు అరెస్టు చేస్తారేమోనని వ్యంగ్యాస్త్రం సంధించారు. అశోక్ లే లాండ్ వాళ్ళను ఎందుకు విచారించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.




Updated Date - 2020-10-21T20:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising