ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్ట్

ABN, First Publish Date - 2020-12-30T20:42:45+05:30

అరెస్టులు.. దాడులు ప్రతి దాడులతో తాడిపత్రి అట్టుడికి పోతోంది. అటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరులు అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అరెస్టులు.. దాడులు ప్రతి దాడులతో తాడిపత్రి అట్టుడికి పోతోంది. అటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అక్కడ సాదారణ పరిస్థితి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. బుధవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు సోమశేఖర్ నాయుడిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. జేసీతో పాటు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 30 7సెక్షన్ కింద తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి ఫ్యాక్షన్‌కు పెట్టింది పేరు. అక్కడ జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా కక్షలున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు బయట ఎక్కడైనా పరస్పరం తారసపడితే ఏం జరుగుతుందోనని పట్టణ ప్రజలు బెంబేలెత్తుతారు. వారిని అదుపు చేయలేక పోలీసులు ఆందోళన చెందుతారు. జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య పోరు దశాబ్దాలుగా సాగుతోంది. గత ఎన్నికల్లో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ఆ రెండు వర్గాలు రాజకీయ ప్రత్యర్థులుగా మారాయి. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో నిప్పులు చెరుగుతున్నారు. సందర్భమేదైనా.. సరే ఈ నేతలిద్దరరూ ఒకరికొకరు తారసపడ్డారంటే అక్కడ యుద్ధ వాతావరణమే ఏర్పడుతోందనటంలో సందేహం లేదు. 

Updated Date - 2020-12-30T20:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising