ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావాళ్ల వీపులు పగులగొట్టి ఏకగ్రీవమంటే సరిపోతుందా? జేసీ ఫైర్

ABN, First Publish Date - 2020-03-16T20:27:39+05:30

నామినేషన్ల ముందు, తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు. ఎన్నికల కమిషనర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : టీడీపీ వాళ్ల వీపులు పగులకొట్టి ఏకగ్రీవాలంటే సరిపోతుందా? అని మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ముందు, తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను జేసీ దివాకర్ రెడ్డి సోమవారం కలిశారు. కష్టపడి నామినేషన్లు వేశామని, వేసినా పోలీసులు, వైసీపీ వారు ఉండనిస్తారా? అని ఎద్దేవా చేశారు.


ప్రభుత్వ అధినేతకు, ఉన్నతాధికారులకు పోలీసులు భయపడుతున్నారని, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తేనే దౌర్జన్య కాండను ఆపవచ్చని తాము ఈసీని కోరామని అన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద డబ్బులు లేకపోతే టీడీపీ ఆ ఖర్చును భరిస్తుందని అన్నామని, తమ వాదనను ఆయన సానుకూలంగా విన్నారని పేర్కొన్నారు.


అయితే పోలింగ్ తేదీన పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారో లేదో చూడాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఎక్కువ రోజులు తీసుకోవడం సరికాదని, తక్కువ రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగియాలని ఆయన అభిప్రాయపడ్డారు. తక్కువ రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిస్తే ఖర్చు ఆదా అవుతుందని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-03-16T20:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising