ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ చాలా తెలివైనవాడు: జేసీ దివాకర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-03-16T19:11:29+05:30

ఏపీ సీఎం జగన్ చాలా తెలివైనవాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సీఎం జగన్ చాలా తెలివైనవాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి.. పోలీసులు ఉంటే సరిపోతుందంటూ జగన్ తీరును జేసీ ఎండగట్టారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడని, తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడని, ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసని దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం స్వాగతించదగ్గ నిర్ణయమేనని, అందువల్ల మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. తాను టీడీపీ అయినంత మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదని చెబుతూ.. జగన్ చాలా తెలివైన వాడని సెటైర్ వేశారు. ప్రతి ఒక్కరికీ సమాజిక వర్గం ఉంటుందని, అది లేని వారు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-03-16T19:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising