ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీకి చేతగాకే చంద్రబాబుని సాక్ష్యాధారాలు అడిగారా?: జవహర్‌

ABN, First Publish Date - 2020-10-01T16:55:59+05:30

ఏపీ డీజీపీకి చేతగాకే చంద్రబాబుని సాక్ష్యాధారాలు అడిగారా? అని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ డీజీపీకి చేతగాకే చంద్రబాబుని సాక్ష్యాధారాలు అడిగారా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్‌ ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలను పోలీసులుగా నియమిస్తే డీజీపీకి సాక్ష్యాలు తెచ్చిస్తారన్నారు. పోలీసువ్యవస్థను చేతిలో పెట్టుకొని సాక్ష్యాలు తెచ్చిమ్మని అడగటం ఏమిటి? అంటూ మండిపడ్డారు. డీజీపీ ఇంకా జగన్ మత్తులోనే ఉన్నారని, మత్తు వీడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.


మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి, ఎంపీ విజయసాయికి డీజీపీ ఎందుకు లేఖలు రాయలేదని జవహర్ ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే డీజీపీ అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మౌనంగా ఉండబట్టే దళితులపై, ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడలేకపోతే డీజీపీ ఉద్యోగాన్ని వదిలేస్తే మంచిదన్నారు. చంద్రబాబుకి రాసిన లేఖను డీజీపీ ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని జవహర్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-10-01T16:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising