ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్ట్‌ ఏపీ కాదు... కిల్డ్‌ ఏపీ: జవహర్‌

ABN, First Publish Date - 2020-02-22T09:59:37+05:30

‘ప్రభుత్వ భూ ములను అమ్ముకోవడానికే వైసీపీ ప్రభుత్వం బిల్ట్‌ ఏపీని తెరమీదకు తెచ్చింది. నిజానికి ఇది రాష్ట్ర ప్రజలపాలిటి కిల్డ్‌ ఏపీ గా మారనుంది’’ అని మాజీ మంత్రి జవహర్‌ శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ భూ ములను అమ్ముకోవడానికే వైసీపీ ప్రభుత్వం బిల్ట్‌ ఏపీని తెరమీదకు తెచ్చింది. నిజానికి ఇది రాష్ట్ర ప్రజలపాలిటి కిల్డ్‌ ఏపీ గా మారనుంది’’ అని మాజీ మంత్రి జవహర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు. ఉగాదిలోగా స్థలాల టార్గెట్‌ పూర్తి చేసుకునేందుకు పేదల స్థలాలను స్వాధీనం చేసుకునే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూ కబ్జాలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పేదవాని గుడిసెని జేసీబీతో పీకేసి, ఆ స్థలాన్ని లాక్కుని, ఆ 2.5 సెంట్లలో 1.5 సెంట్లు తిరిగిస్తామనడం జగన్‌ నవ మాసాల పాలనలో 9వ మోసమని విమర్శించారు. విశాఖలో 4 వేల ఎకరాల విలువై న ప్రభుత్వ భూమిని ‘బిల్ట్‌ ఏపీ’ పేరుతో తక్కువ ధరకు అ మ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు సాగు చేసుకుంటున్న 10 వేల ఎకరాలను లాక్కుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని బిల్డప్‌ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇడుపులపాయ ఎస్టేట్‌లో ఉన్న వందలాది ఎకరాలను జగన్‌ పేదలకు పంచగలడా? అని జవహర్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2020-02-22T09:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising