ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చితికిన రైతన్నను మద్యం సొమ్ముతో ఆదుకోండి

ABN, First Publish Date - 2020-12-06T08:22:00+05:30

‘‘ఎన్నికల ముందు బంగారు ఆంధ్ర అన్నా రు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే... అబ్బ, రాష్ట్రం బంగారు ఆంధ్ర అవుతుంది అని అంతా అనుకున్నాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిమాండ్లపై స్పందించకుంటే 7న రాష్ట్రవ్యాప్త ఆందోళన: పవన్‌ 


నెల్లూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికల ముందు బంగారు ఆంధ్ర అన్నా రు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే... అబ్బ, రాష్ట్రం బంగారు ఆంధ్ర అవుతుంది అని అంతా అనుకున్నాం. కానీ ఆ పేరుతో బాటిళ్లు అమ్ముకుంటారని అనుకోలేదు. భవిష్యత్తులో సీఎం బ్రాండ్‌, వైసీపీ బ్రాండ్‌ పేర్లతో కూడా మద్యం అమ్ముకోవచ్చు. ఏ పేర్లతోనైనా అమ్ముకోండి... కానీ ఈ ఒక్క ఏడాది మద్యం డబ్బు రూ.16 వేల కోట్లను వరుస తుఫాన్లతో చితికిపోయిన రైతన్నలకు పంచండి’’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తుఫాను బాధితులను పరామర్శించడానికి 2 రోజులపాటు పర్యటించిన ఆయన శనివారం నెల్లూరులోని విలేకరులతో మాట్లాడారు.


ఎకరానికి రూ.35 వేలు పంట నష్టపరిహాం చెల్లించాలన్నది జనసేన డిమాండు కాదని, తుఫాను తాకిడికి నష్టపోయిన అన్ని జిల్లాల రైతుల అభ్యర్థనలని తెలిపారు. ఇంత మొత్తం పరిహారమంటే ప్రభుత్వానికి కష్టంగా ఉంటుందనే ఒక ఏడాది మద్యం అమ్మకాల ఆదాయాన్ని రై తులకు పరిహారం కింద ఇవ్వమని కోరుతున్నామని వివరించారు. తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖ అఽధికారుల నిర్లక్ష్యం వల్ల తుఫాను నష్టం మరింత పెరిగిందని పవన్‌ ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో నీటి పారుదల శాఖ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. జనసేన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో 7న నిరసనోద్యమం చేపడతామని ప్రకటించారు. 


జీహెచ్‌ఎంసీ ఫలితాలు మార్పునకు సంకేతం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచన సరళిలో మార్పును సూచిస్తున్నాయని పవన్‌ అన్నారు. ఎన్నికల్లో ప్రతి జనసేన సైనికుడు బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారన్నారు. తొలుత ఈ ఎన్నికల్లో 60 మంది జనసేన సైనికులు పోటీ చేయాలని అనుకున్నారన్నారు. అయితే బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, పనిచేసిన జనసైనికులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీపై బీజేపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. 

Updated Date - 2020-12-06T08:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising