ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వకీల్ సాబ్ అంటే అర్థం తెలుసా కొడాలి నాని?: జనసేన నేత

ABN, First Publish Date - 2020-12-30T19:02:30+05:30

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత శివశంకర్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత శివశంకర్ స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో నివర్ తుఫాన్ రైతులకు తీవ్ర నష్టం చేకూర్చిందన్నారు. రైతుల సమస్యలపై పవన్ అండగా ఉండి రైతులకు భరోసా ఇచ్చారని, రైతులకు నష్టపరిహారంపై ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పార్టీ నేతగా సీఎం జగన్ మాట్లాడుతున్నారే తప్ప.. ప్రజల ముఖ్యమంత్రిగా మాట్లాడడంలేదని ఆరోపించారు. 


సీఎం వెనుక ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్.. కొడాలి నాని అయితే బూతులు మాట్లాడడంతప్ప.. పరిపాలన, సమస్యలపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బూతులు మాట్లాడే వారు నానిలు అయ్యారని, నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. వకీల్ సాబ్ అంటే అర్థం తెలుసా కొడాలి నాని? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను మంత్రులుగా  పెట్టుకొని సీఎం పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడని మీరు చెంచా నాయకులని దుయ్యబట్టారు. ఇకనైనా వ్యక్తిగత దాడులు ఆపాలని, నివర్ నష్టపరిహారం రైతులకు తక్షణమే ఇవ్వాలని శివశంకర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-30T19:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising