ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని తరలింపు...వ్యక్తిగత నిర్ణయమే: నాదెండ్ల

ABN, First Publish Date - 2020-08-02T18:46:29+05:30

రాజధాని తరలింపు...వ్యక్తిగత నిర్ణయమే: నాదెండ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదని..ప్రభుత్వ అజెండా ప్రకారం చేసినది కాదని... వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో అధినేత పవన్‌ కళ్యాణ్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ...“రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వ అజెండా ప్రకారం చేసినది కాదు. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు... ఆ వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో మంత్రులకు కూడా రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తెలియవు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. చంద్రబాబు ఒక తెలివైన సేల్స్ మేన్. మార్కెటింగ్ చేసుకున్నారు. అంతే తప్ప రాజధాని నిర్మాణం విషయంలో బలమైన చట్టం తీసుకోవడంపై శ్రద్ధపెట్ట లేదు. దాని ఫలితమే ఇది. ఆది నుంచి ఆ ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పటడుగులు వేసి రాజధాని రైతులను నష్టపరిచారు. ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతోనే భూములను రైతులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. అంటే నాడు ప్రభుత్వం రాజధాని తరలించేందుకు ఆస్కారం లేని చట్టం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది. రాజధాని గ్రామాల్లో భూ కుంభకోణాలు జరిగాయి అని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ కుంభకోణాలు చేసిన వారిని విచారించి శిక్షించమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  చెప్పారు. ఆ పేరుతో రైతులను ఇబ్బందిపెట్టవద్దు... వారి త్యాగాలను గుర్తించమని చెప్పారు. రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ పర్యటించి అక్కడి నిర్మాణాలు పరిశీలించారు. అలాగే రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. మద్దతు తెలిపారు. తొలి నుంచి ఒక రైతులు నష్టపోకూడదు అని చెబుతున్నారు.” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 


పవన్ కళ్యాణ్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్‌తో పాటు కె.నాగబాబు, తోట చంద్ర శేఖర్, పీ.ఏ.సీ. సభ్యులు పాల్గొన్నారు. ముందుగా విశాఖలో హిందుస్తాన్ షిప్ యాడ్ దుర్ఘటనలో మృతులకు నేతలు సానుభూతి తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ, అమరావతి నుంచి రాజధాని తరలింపు, భూములు ఇచ్చిన రైతుల ఆందోళనపై టెలికాన్ఫరెన్స్‌లో చర్చించారు. 

Updated Date - 2020-08-02T18:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising