ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుకు జల‘కలే’!

ABN, First Publish Date - 2020-09-28T10:18:30+05:30

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. ఎస్సీ, ఎస్టీలు రూ.6వేలు, ఇతరులు రూ.25 వేలు చెల్లిస్తే వ్యవసాయ బోరు, మోటారు, సోలార్‌ పంపుసెట్‌ ఉచితంగా ఇచ్చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోరు తవ్వితే మోటారు ఎవరిస్తారు?

గతంలో ఎన్టీఆర్‌ జలసిరి కింద..

బోరు, మోటార్‌, సోలార్‌ పంపుసెట్‌

ఎస్సీ, ఎస్టీలు 6 వేలు కట్టేవారు

ఇతరులు 25 వేలు చెల్లించేవారు

ఇప్పుడు వట్టి బోరుతో సరిపెట్టుకోవాలి

మోటారు, పంపుసెట్‌పై సర్కారు మౌనం

‘వైఎ్‌సఆర్‌ జలకళ’పై రైతుల ఆగ్రహం


రైతుకు భరోసా ఇచ్చే పథకాన్ని రద్దుచేసి.. జగన్‌ ప్రభుత్వం తెచ్చిన వైఎస్సారర్‌ జలకళ  పథకం తీరుతెన్నులపై అన్నదాతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. గతంలో కొంత మొత్తం తాము చెల్లిస్తే బోరు వేయడంతో పాటు మోటారు, సోలార్‌ పంపుసెట్‌ను టీడీపీ ప్రభుత్వం సమకూర్చేదని.. ఇప్పుడు కొత్త స్కీం కింద బోరు మాత్రమే వేస్తున్నారని మండిపడుతున్నారు. మోటారు. సోలార్‌ పంపుసెట్‌ కొనుక్కోవడానికి తమ వద్ద డబ్బులెక్కడ ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. ఎస్సీ, ఎస్టీలు రూ.6వేలు, ఇతరులు రూ.25 వేలు చెల్లిస్తే వ్యవసాయ బోరు, మోటారు, సోలార్‌ పంపుసెట్‌ ఉచితంగా ఇచ్చే ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని అమలు చేశారు. జగన్‌ సర్కారు రాగానే.. ఈ పథకాన్ని రద్దుచేసి వైఎస్సార్‌ జలకళ స్కీంను ప్రవేశపెట్టారు. పేరొకటే మారిందని ఎస్సీ, ఎస్టీలు, ఇతర బడుగు వర్గాలకు చెందిన రైతులు భావించారు. కానీ ఆ పథకం విధివిధానాలు పరిశీలిస్తే తమకు అది భారమే కానుందని వాపోతున్నారు. జలసిరి పథకాన్ని రద్దుచేసిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ.. తాజాగా బోర్ల తవ్వకానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వమే తన ఖర్చుతో బోర్లు వేస్తుందని.. రైతులు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


అయితే తవ్విన బోర్లకు మోటార్లు, విద్యుత్‌ కనెక్షన్లకు ఖర్చు ఎవరు భరించాలో ప్రస్తావించలేదు. ఇప్పటికే బోర్లు వేసుకున్న పేద రైతులు.. మోటార్ల కోసం ఎక్కడకు వెళ్లాలని నిలదీస్తున్నారు. ఉన్న పథకాన్ని రద్దు చేయడమెందుకు.. ఉపయోగపడని పథకాన్ని అమల్లోకి తీసుకురావడం ఎందుకని నిలదీస్తున్నారు. పైగా ఈ బోర్లు అందరికీ సకాలంలో అందుతాయా అన్న సందేహాలు నెలకొన్నాయి. రాజకీయ నేతలు, పెద్దల సిఫారసుల మేరకే వేస్తారేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 


గతంలో పేద రైతుల జలసిరి...

పేదరైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పథకం ఎన్టీఆర్‌ జలసిరి. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పటి సీఎస్‌ ఎస్పీ టక్కర్‌, ఆ తర్వాత వచ్చిన దినేశ్‌కుమార్‌.. సుమారు 10మంది నిపుణులతో కమిటీలు వేసి సమగ్ర మార్గదర్శకాలను రూపొందించారు. దరఖాస్తు ప్రక్రియ నుంచి సర్టిఫికెట్ల సమర్పణ వరకు సరళతరం చేసి శాచురేషన్‌ విధానంలో భూమి ఉన్న పేదరైతుకు బోరువేసే విధంగా ప్రణాళిక తయారుచేశారు. రెండేళ్ల పాటు ఈ పథకం ప్రయోగ దశలో నడిచింది. దీనిపై విస్తృతంగా అవగాహన కలగడంతో రైతులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. రూ.6వేలు చెల్లిస్తే ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 200అడుగుల బోరుబావితో పాటు రూ.2.42 లక్షల విలువ చేసే 5హెచ్‌పీ సోలార్‌ పంపుసెట్టు అమర్చేవారు.


ఇతర వర్గాలవారు రూ.25వేలు చెల్లిస్తే ఈ సౌకర్యాలన్నీ అందేవి. 2018-19లె 45,300 బోర్లు తవ్వి సోలార్‌ పంపుసెట్లు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లో 12,305 బోరుబావులు తవ్వారు. దాదాపు 8,939బోరుబావులను సోలార్‌ పంపుసెట్లతో శక్త్తిమంతం చేశారు. దీంతో 17,878 రైతులు లబ్ధిపొందగా, 44,695 ఎకరాలు సాగులోకొచ్చాయి. ఇందుకు ప్రభుత్వం రూ.51.26కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తం గా లక్ష బోర్లు ఏర్పాటుచేసి 10లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతలోనే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం రావడం, ఉన్న పథకాన్ని రద్దు చేయడం జరిగిపోయాయి.

Updated Date - 2020-09-28T10:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising