ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. వైద్యం నిరాకరించిన డాక్టర్లు

ABN, First Publish Date - 2020-03-28T19:34:07+05:30

జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు చేదు అనుభవం ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గయ్యపేట: జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు చేదు అనుభవం ఎదురైంది. జ్వరంతో బాధపడుతున్న బాలుడిని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లగా వైద్యం చేయబోమని వైద్యులు చెప్పారు. ఎవరు చెప్పినా చెయ్యలేమని వైద్యులు తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యే ఖంగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం తండాకు చెందిన మహిళ తన కుమారుడి వైద్యం కోసం హాస్పిటల్‌కు తీసుకువెళ్లింది. అక్కడి వైద్యులు తిరస్కరించారు. దీంతో వెనక్కి వెళ్లిపోతున్న ఆమెకు.. అక్కడే మాస్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఎదురయ్యారు. తనగోడును వెళ్లబోసుకోగా.. స్వయంగా ఆయనే బాలుడిని డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. అయితే అక్కడి డాక్టర్లు వైద్య సహాయానికి నిరాకరించారు. సాధారణ జ్వరాలకు వైద్యం చేయొద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని.. విజయవాడకు తీసుకువెళ్లాల్సిందేనని అన్నారు.  దీంతో డాక్టర్లకు, ఎమ్మెల్యేకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఏం చేయాలో ఎమ్మెల్యేకు పాలుపోక.. ఉన్నతాధికారులతో మాట్లాడతానంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2020-03-28T19:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising