ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ

ABN, First Publish Date - 2020-11-13T18:35:52+05:30

గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. అలాగే వీసీల నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఫైల్ ప్రభుత్వం నుంచి వచ్చి చాలా కాలమవుతున్నా గవర్నర్ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. 


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విషయంలో ఇటీవల కేంద్రంతో జరిపిన చర్చల సారాంశాన్ని సీఎం జగన్ గవర్నర్‌కు వివరించారు. అలాగే ఈ నెలాఖరున శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీలు, ఏయే బిల్లులు ప్రవేశపెట్టేది తదితరవాటిపై ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చించినట్లుగా తెలియవచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కరోనా, ఇతర అంశాలపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.

Updated Date - 2020-11-13T18:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising