అమిత్‌షాతో జగన్ భేటీ
ABN, First Publish Date - 2020-12-16T02:19:27+05:30
కేంద్రమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. భారీ వర్షాలు
ఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే భారీ వర్షాలు, నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తినష్టం గురించి వివరించి... తక్షణమే సహాయం అందించాలని జగన్ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సీఎం ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయాంశాలే అత్యధికంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన ‘భారత్ బంద్’కు వైసీపీ సర్కారు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. సాగు చట్టాలపై జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. 700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి.. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుందని వివరించాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలని జగన్‌ను అమిత్‌షా కోరనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2020-12-16T02:19:27+05:30 IST