సీబీఐ తర్వాతే.. ఈడీ కేసుల విచారణ చేపట్టాలి
ABN, First Publish Date - 2020-11-13T09:27:47+05:30
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసుల విచారణ ముగిసిన తర్వాతే.. ఈడీ కేసులపై విచారణ చేపట్టాలంటూ
కోర్టును కోరిన జగన్ న్యాయవాదులు
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసుల విచారణ ముగిసిన తర్వాతే.. ఈడీ కేసులపై విచారణ చేపట్టాలంటూ నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్ రెడ్డి, యు. ఉమా మహేశ్వరరావు, జి.అశోక్ రెడ్డి.. సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం వాదనలు వినిపించారు. జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల వ్యవహరంపై సీబీఐ కేసు ఆధారంగానే ఈడీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో.. మొదట సీబీఐ కేసుల విచారణ మాత్రమే జరపాలని కోర్టుకు వారు నివేదించారు. కాగా, ఈడీ కేసుల విచారణ ఈ నెల(నవంబరు) 17కి, సీబీఐ కేసుల విచారణను 16కి కోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2020-11-13T09:27:47+05:30 IST