ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్మాలపాటిపై జగన్ వేట వెనుక అసలు రహస్యం ఇదే..

ABN, First Publish Date - 2020-09-15T20:58:13+05:30

అమరావతి భూముల్లో అక్రమాల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాను అమలు చేయడం మొదలుపెట్టిందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అమరావతి భూముల్లో అక్రమాల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాను అమలు చేయడం మొదలుపెట్టిందా? పాత కక్షలన్నీ తీర్చుకునేందుకు ఏసీబీ విచారణకు తెరతీసిందా? మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసిన తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. మాజీ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తిపై ఇలా పర్సనల్‌గా గురిపెట్టడం న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతి భూములపై విచారణ అంటూ జగన్ పర్సనల్ ఏజెండాను అమలు చేస్తున్నారని కూడా దమ్మాలపాటి శ్రీనివాస్‌పై నమోదు చేసిన కేసుతో తేలిపోయిందని అంటున్నారు.


అమరావతి భూములపై విచారణకు ఆదేశించడానికి ముందే, సిట్ ఏర్పాటుకు దమ్మాలపాటి టార్గెట్ అయిపోయారు. అధికార యంత్రాంగం ఆయన వ్యక్తిగత వివరాల కోసం కూపీ లాగడం మొదలు పెట్టింది. అసలు ఏ మాత్రం సంబంధం లేని ఇంటిలిజెన్స్ శాఖ సీన్ లోకి ఎంటర్ అయ్యింది. దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ కావాలని, ఏకంగా గత పదేళ్లలో ఆయన దాఖలు చేసిన రిటర్న్స్ తమకి ఇవ్వాలని ఇంటిలిజెన్స్ ... ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాసింది. ఆదాయపు పన్ను శాఖ అదేం కురదరదని తేల్చేసింది. అయితే అసలు అమరావతి భూముల విషయంలో సిట్ వేయక ముందే ఇంటిలిజెన్స్ ఇలా ఓ ప్రైవేటు వ్యక్తి ఐటీ రిటర్న్స్ అడగడంలోనే అసలు మతలబు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, దమ్మాలపాటిని కేసులో ఇరికించాలని ముందుగానే అనుకొని ఆధారాలు సేకరించారని ఇక్కడే తేలిపోతోంది అంటున్నారు న్యాయ నిపుణులు.


దమ్మాలపాటిపై జగన్ గురి ఈనాటిది కాదు. అక్రమాస్తుల కేసులో లాయర్‌గా దమ్మాలపాటి కీలకంగా వ్యవహరించారు. జగన్‌కి వ్యతిరేకంగా వాదించారు. జగన్ క్విడ్ ప్రోకో ఎలా చేశారు? తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలు ఎలా నడిపారు? కంపెనీలకు ఫేవర్లు చేసి, వాటి నుంచి ప్రయోజనాలను సొంతానికి ఎలా వాడుకున్నారో కోర్టుకు వివరించింది దమ్మాలపాటే.. ఆ ఫలితంగానే సీబీఐ 14 ఛార్జిషీట్లు వేసింది. ఈడీ కేసులూ నమోదు అయ్యాయి. అదే కక్షతో దమ్మాలపాటిపై నేరుగా జగన్ గురి పెట్టారు అని అంటున్నారు.


ప్రైవేటు వ్యక్తిగా ఉన్న దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ అడగడం మొదలు... రహస్య విచారణ అంటూ ఇంటిలిజెన్స్ రంగంలోకి దిగడం - ఏదో రకంగా దమ్మాలపాటిని ఏసీబీ కేసులో ఇరికించాడాన్ని బట్టీ అమరావతి పేరుతో జగన్ రాజకీయ వేట కొనసాగిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయ్ ఇప్పుడు. మాజీ అడ్వొకేట్ జనరల్ విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు న్యాయ వర్గాల్నే నివ్వెరపరుస్తున్నట్టు కనిపిస్తోంది. 


అమరావతి భూముల విషయంలో ఏసీబీ విచారణ పేరుతో ప్రభుత్వం రాజకీయ వ్యూహానికి తెర తీసినట్టుగా కనిపిస్తోంది. పాత కక్షలు అన్నీ సాధించేందుకు, వ్యక్తులను టార్గెట్ చేసేందుకు విచారణను వాడుకుంటున్నట్టు దమ్మాలపాటి వ్యవహారంతో తేలిపోతోంది అంటున్నారు న్యాయనిపుణులు. సిట్ విచారణకు ఆదేశించడానికి ముందే ఐటీ రిటర్న్స్ కోసం ఇంటిలిజెన్స్ శాఖ కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దమ్మాలపాటి జగన్ కేసుల్లో వాదించింనందుకే ఈ కక్ష సాధింపు అనే మాట వినిపిస్తోంది. ఆ కక్షతోనే జగన్ ఇప్పుడు మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటిగా గురి పెట్టారు అంటున్నారు. ఇంటిలిజెన్స్ రాసిన లేఖే దానికి రుజువు అంటున్నారు. 

Updated Date - 2020-09-15T20:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising