ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులను తొలగించి మెరుగైన సేవలా?

ABN, First Publish Date - 2020-12-01T09:34:14+05:30

సీఎం జగన్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు 104 ఎంఎంయూ ఉద్యోగులకు న్యాయం చేయాలని, లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయం చేయకుంటే ఉద్యమం ఉధృతం

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక


విజయవాడ సిటీ, నవంబరు 30: సీఎం జగన్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు 104 ఎంఎంయూ ఉద్యోగులకు న్యాయం చేయాలని, లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌, వర్కర్స్‌ ఫెడరేషన్‌ జేఏసీ చైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ 104 ఎంఎం యూ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో సోమవారం నిర్వహించిన ధర్నాలో 13 జిల్లాల నుంచి 104 ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 


104 వాహనాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పారామెడికల్‌ ఉద్యోగులైన ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్స్‌, వాచ్‌మ న్లు.. మొత్తం 756 మంది ఉద్యోగులను తొలగించి కేవలం డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ఏ విధంగా అందిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గతం లో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని,  ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తాము ధర్నా కు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చే యడాన్ని పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు.

Updated Date - 2020-12-01T09:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising