మూడు రోజులు వర్షాలు
ABN, First Publish Date - 2020-10-04T08:16:58+05:30
ఒడిసా తీరప్రాంతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం విశాఖ,
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఒడిసా తీరప్రాంతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలినచోట్ల అక్కడక్కడ వర్షాలు కురిశాయి.
ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు బంగాళాఖాతంలో ఒడిసా తీరం వైపు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
Updated Date - 2020-10-04T08:16:58+05:30 IST