ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర దోపిడి దొంగల ముఠా అరెస్టు

ABN, First Publish Date - 2020-09-28T10:29:10+05:30

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రాయచోటి రోడ్డు బ్రాహ్మణపల్లె సబ్‌స్టేషన్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున అంతర్రాష్ట్ర దొంగల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారు, పిస్టల్‌, మూడు బైకులు స్వాధీనం


కడప (క్రైం), సెప్టెంబరు 27: కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రాయచోటి రోడ్డు బ్రాహ్మణపల్లె సబ్‌స్టేషన్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా కొందరు యువకులు పారిపోతుండగా వారిని విచారించడంతో కర్ణాటక రాష్ట్రం బళ్లారి, అనంతపురం జిల్లాల్లో వారు దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.


జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదివారం తన కార్యాలయంలో విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన పలువురు అనంతపురం పరిసర ప్రాంతాలతో పాటు రాయదుర్గం, కడప నగరం, రాజంపేట పరిసరాల్లో నివాసముంటూ ముందుగా రెక్కీ చేసి దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మూడురోజుల క్రితం రాజంపేటలోని బ్రాహ్మణపల్లె వద్ద యాసిర్‌, వంశీ, కిరణ్‌, రాజేష్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారంతో మొత్తం 21 మంది ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. నిందితుల నుంచి కారు, నాటు తుపాకీ, రూ.10,300 నగదు, మూడు బైక్‌లు, 15 సెల్‌ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Updated Date - 2020-09-28T10:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising