ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాలు ఇన్‌స్టాలో అప్‌లోడ్

ABN, First Publish Date - 2020-06-29T18:06:28+05:30

బీటెక్ విద్యార్థిని కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నగ్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థిని కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నగ్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించారు. ఐపీ అడ్రస్ ద్వారా ఆధారాల సేకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వరుణ్ తేజ్‌కు హత్యకు గురైన రౌడీ షీటర్ బసవల వాసుతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.

మరోవైపు ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారం ఘటనపై అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డితో మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సమావేశం అయ్యారు. ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరును అడిగి తెలుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.  పోలీసులతో జరిగిన ఘటనపై చర్చించామన్నారు.మత్తు మందు తాగించి, న్యూడ్ విడియోలు తీయటం దారుణమన్నారు. అమ్మాయిలు ఎవరు భయపడవద్దని.. ధైర్యంగా దిశ పోలీసు స్టేషన్‌కి రండని భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ప్రేమ వ్యవహారాలు ఏదైనా దరితప్పితేనే బయటకు వస్తున్నారని, అలాంటి వాటిని ముందుగానే గుర్తించి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారం రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని పోలీసులకు చెప్పామని, సాంకేతిక పరిజ్ఞానంతో కొంత జాప్యం జరుగుతుందన్నారు. అత్యంత వేగంగా ఛార్జ్ షీట్ వేయాలని, బెయిల్ రాకముందే పోలీసులు వేగంగా వ్యవహరించాలన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లాంటి సంస్థలతో మాట్లాడి న్యూడ్ విడియోలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాలకు చెందిన యువకులు కావటంతో మీడియా ముందు చూపలేదనటానికి అవకాశం లేదన్నారు. కేవలం యువత భవిష్యత్తు కోసమే వాళ్ళని మీడియాకి చూపలేదన్నారు. డిజిటల్ ఎవిడెన్స్ కోసమే కేసులో నిందితులు అరెస్ట్ చేయటంలో జాప్యం జరిగిందన్నారు. 

Updated Date - 2020-06-29T18:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising