పెంచుకుంటూ పోతానన్నా!
ABN, First Publish Date - 2020-12-05T08:14:45+05:30
పింఛను రూ.3 వేలు చేస్తాననడం, 45 ఏళ్లకే పెన్షన్ అన్న మాటను తర్వాత వైఎస్సార్ చేయూతగా మార్చడంపై ఎన్ని సార్లు చెప్పినా..
జూలై 8న పింఛను రూ.250 పెంచుతాం
ఆ తర్వాత రెండేళ్లూ అదే రోజు పెంపు: సీఎం
3-4 నెలల్లో కరోనా వ్యాక్సిన్
తొలి దశలో కోటి మందికి
ముందుగా ఫ్రంట్ వారియర్స్,50 ఏళ్లుపైబడిన వారికే
వ్యాక్సిన్ నిల్వకు 4,065 ఫ్రీజర్లు
అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పింఛను రూ.3 వేలు చేస్తాననడం, 45 ఏళ్లకే పెన్షన్ అన్న మాటను తర్వాత వైఎస్సార్ చేయూతగా మార్చడంపై ఎన్ని సార్లు చెప్పినా.. ప్రతిపక్షం అబద్ధాలు చెబుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో తాను పెన్షన్‌ను మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ వెళ్తానని చెప్పానన్నారు. అధికారంలోకి రాగానే రూ.2,250 చేశామని, వచ్చే ఏడాది జూలై 8న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా మరో రూ.250 పెంచుతామని.. ఆ తర్వాత వరుసగా రెండేళ్లు అదే రోజు రూ.250 చొప్పున పెంచి.. మూడు వేలు చే స్తామని తెలిపారు. శుక్రవారం టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశాక అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పింఛన్లపై తాను చెప్పినవి అబద్ధాలని చంద్రబాబు అంటే ఆ వార్తను ఆయా పత్రికలు, టీవీలు ప్రధానంగా ప్రచురించడం దారుణమన్నారు. ‘చంద్రబాబు సీఎంగా ఉండగా.. నాలుగేళ్ల 10 నెలలు వెయ్యి రూపాయల చొప్పున పింఛను ఇచ్చి.. చివరి 2 నెలలు మాత్రమే రూ.2 వేలిచ్చారు. అలాగే ఎన్నికలకు 4 నెలల ముందు వరకు సుమారు 45.92 లక్ష ల మందికి పింఛను ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల ముందు 51 లక్షల మందికి ఇచ్చారు. అం టే 6 లక్షల మంది అర్హులున్నారని తెలిసీ నా లుగున్నరేళ్లకు పైగా వదిలేసి ఎన్నికల ముందు మాత్రం వారికి పింఛన్లు ఇవ్వడం తప్పు కాదా’ అని ప్రశ్నించారు.
చంద్రబాబు సభలో ఉంటారేమో అమూల్ ద్వారా ఏ రకంగా అక్కచెల్లెమ్మలకు అండగా ఉందో చెబితే వింటారేమోన ని అనుకున్నానన్నారు. ‘కానీ కుళ్లు, కుట్రలు ఎక్కువ. ఏకంగా పోడియం దాటి సభాపతి స్థానం వద్దకు తన ఎమ్మెల్యేలను పంపించి స స్పెండ్ చేసేలా చేసుకున్నారు. వైఎస్సార్ చే యూత విషయంలో మేనిఫెస్టోలో పెట్టిందే అమలుచేస్తున్నాం. 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు అధికారంలోకి వచ్చి న రెండో ఏడాది నుంచి ఏటా రూ.25 వేల చొప్పున.. 3 విడతల్లో రూ.75 వేలు ఇస్తామ న్నా’ అని తెలిపారు. ఆ వీడియోను శాసనసభలో ప్రదర్శించారు.
ఇంత స్పష్టంగా ఉంటే ఇం కెక్కడ అబద్ధాలు చెప్పాం అన్నారు. కేవలం తమకు సంబంధించిన వ్యక్తి సీఎం స్థానంలో లేరన్న ఒకే ఒక్క కడుపు మంటతో, దురదతో.. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఇలా రాస్తున్నాయని ఆక్షేపించారు. ‘హామీ ప్రకారమే 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు 24.55 లక్షల మందికి రూ.4,604 కోట్లు ఇచ్చాం. వాటి నుంచి ఆదాయం వచ్చేలా ఏదో ఒక వ్యా పారానికి అనుసంధానం చేస్తున్నాం. దీనికోసం రిలయన్స్, పీఅండ్‌జీ, అమూల్, ఐటీసీ, అల్లా నా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రా ష్ట్రంలో దాదాపు 77 వేల రిటైల్ స్టోర్లు గ్రా మాల్లో కనిపిస్తాయి. ఆయా కంపెనీల డీలర్లు గా వీరు వస్తువులు అమ్ముతూ ఆదాయం పొం దుతారు. గేదెలు, ఆవులను కూడా ఇచ్చి ఆ పాలను అమూల్ కొనేలా చేశాం. 4.69 లక్షల మం దికి పాడి యూనిట్లు ఇస్తు న్నాం. అమూల్‌కు రైతులే యజమానులు. వారు లా భాలు కూడా ఉంచుకోరు. ఏటా రెండు సార్లు బోనస్ రూపంలో పంచేస్తారు. 2. 49 లక్షల మందికి మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తు న్నాం. ఒక్కో యూనిట్ అం టే 14 మేకలు, ఒక గొర్రె ఉంటాయి. చేయూత పథకంలో లబ్ధి పొందుతున్న వారిలో 6 లక్షలకు పైగా వితంతువులున్నారు. వారి కి వితంతు పింఛను అందుతుంది కాబట్టి చే యూత ఇవ్వం అనలేదు. అలాంటివారికే మ నం ఇంకా ఎక్కువగా ఉపయోగపడాలని పిం ఛనుతో పాటు చేయూత ద్వారా చేయిపట్టి న డిపిస్తున్నాం. ఇంత మనసుపెట్టి పథకాలు అమలుచేస్తుంటే.. ఇంత దురుద్దేశంతో రాతలు రాస్తా ఉంటే.. వీళ్లసలు మనుషులేనా? ఇప్పటికైనా ప్రజలకు మంచి జరిగేలా, వారిలో మా ర్పు రావాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
మంత్రులదీ అదే మాట..
సీఎం ప్రసంగానికి ముందు పలువురు మంత్రులు మాట్లాడుతూ.. అవాస్తవాలని తెలి సీ ప్రచురిస్తున్న పత్రికలపై కఠిన చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యులు సస్పెన్షన్ అవ్వాలన్న ఉద్దేశంతోనే పోడియం చుట్టుముడుతున్నారని.. వీటిని నియంత్రించేందుకు కఠిన నియమాలు పెట్టాలని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రతిరోజు మార్కెటింగ్ చేసుకోవడమే చంద్రబాబు పని అని, ఆయన తన మనసులో మాట పుస్తకంలోను ఇదే రా సుకున్నారని విమర్శించారు. అవాస్తవాలు రాసే పత్రికల విషయంలో కఠినంగా ఉండాలని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఆ పత్రికలకు లక్షలకు లక్షలు ప్రకటనలు ఇస్తున్నామని, కానీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ప్రెస్‌మీట్‌ను కూడా రాయడం లేదని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. కాగా, ఏపీ విలువ ఆధారిత పన్ను రెండో సవరణ, మూడో సవరణ బి ల్లులు, ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల పై పన్ను విధింపు సవరణ బిల్లు సహా పది బిల్లులకు, సప్లిమెంటరీ బడ్జెట్‌కు కూడా సభ ఆమోదముద్ర వేసింది.
జగన్... దేవ దూత: స్పీకర్
‘‘ఏ యుగంలోనైనా... ఏ జగంలోనైనా ధర్మం త ప్పి, ఆధర్మం పెచ్చు మీరుతున్నప్పుడు.. ధర్మాన్ని తిరిగి పునఃప్రారంభించడానికి ఒక మహానీయుడు వస్తాడు. భగవద్గీతలోనే ఇలా ఉంది. రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అధర్మం పెచ్చుమీరింది. ఆ సమయంలో దేవుడు పంపించిన దూతగా, మహానీయుడుగా ఆయన వచ్చారు’’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం జగన్‌ని ఉద్దేశించి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్... హెరిటేజ్ కోసం డైరీ వ్యవస్థని నాశనం చేసిన చంద్రబాబుపై చర్య తీసుకోవాలని కోరారు. స్పందించిన స్పీకర్.. ‘అతనికి ఇప్పటికే పనిష్మెంట్ ఇచ్చాం’ అన్నారు.
Updated Date - 2020-12-05T08:14:45+05:30 IST