ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డ వ్యవహారంపై ‘సుప్రీం’కు వెళతాం: విజయసాయి

ABN, First Publish Date - 2020-06-01T23:13:00+05:30

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా చదివి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుపై  హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా చదివి, పరిశీలించిన తర్వాత అడ్వకేట్ జనరల్ మీడియా సమావేశంలో మాట్లాడారన్నారు. దాంట్లో ప్రభుత్వానికి ఆదేశాలివ్వడం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. కోర్టు తీర్పును పరిశీలిస్తే గతంలో రమేష్ కుమార్‌ను ఏ విధంగా చంద్రబాబు అపాయింట్ చేశారో.. ఆ విధానాన్ని కోర్టు తీర్పులో తప్పు బట్టడం జరిగిందని.. దానిపై సుప్రీం కోర్టుకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు.


రమేష్ కుమార్ వ్యవహారం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని విజయసాయి విమర్శించారు. బాధ్యతాయుతమైన వ్యక్తి ప్రభుత్వంపై విషం కక్కకూడదని అన్నారు. అధికారపార్టీని ఆయన ఫ్యాక్షనిస్టులు, గూండాలు అంటూ ఆయన కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. ఆ లేఖ కూడా టీడీపీ ఆఫీసులో తయారుచేశారని, సంతకాల్లో కూడా తేడాలు ఉన్నాయన్నారు. రమేష్ కుమార్ పదవి కాలం తగ్గిస్తే.. ఆయన కోర్టుకు వెళ్లినా అర్థం ఉంది. కానీ టీడీపీ నేతలు కూడా ఎందుకు కోర్టుకు వెళ్లారని విజయసాయి ప్రశ్నించారు.

Updated Date - 2020-06-01T23:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising