ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని భూముల కేసులో

ABN, First Publish Date - 2020-09-21T08:32:08+05:30

రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి గుంటూరు ఏసీబీ అధికారులు ఈ నెల 15వ తేదీన నమోదు చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్చిన ఉత్తర్వులను సవరించండి

హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు


అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి గుంటూరు ఏసీబీ అధికారులు ఈ నెల 15వ తేదీన నమోదు చేసిన కేసు విచారణపై స్టే విధించడంతో పాటు ఈ కేసులో ఎలాంటి చర్యలకు దిగరాదని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ గురించి గానీ, అందులోని వివరాల గురించి గానీ ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, సామాజిక మాధ్యమాల ద్వారా బహిర్గతం కావడానికి వీల్లేదని ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది.


ఈ మేరకు మహబూబ్‌నగర్‌కు చెందిన న్యాయవాది మమతారాణి గాలేటి హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన ఆ కేసు పూర్వాపరాలు మాధ్యమాల్లో బహిర్గతం కావడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం.. మీడియా సంస్థల వాక్‌ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించినట్లుగా ఉందని పిటిషన్‌లో తెలిపారు.

రాజ్యాంగం ప్రకారం వాక్‌ స్వాతంత్య్రం.. మీడియాకున్న పవిత్రమైన హక్కని, దానిని హరించేలా ఇలాంటి నిషేధాజ్ఞలు ఇవ్వకూడదన్నారు. ఈ పిటిషన్‌లో తనను ప్రతివాదిగా చేర్చుకుని, తన వాదనలను కూడా వినాలని.. ఇచ్చిన ఉత్తర్వులను సవరించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 


Updated Date - 2020-09-21T08:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising