ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాల చేరుకున్న ఐజీ శంఖబ్రత బాగ్చి

ABN, First Publish Date - 2020-11-08T21:50:46+05:30

ఐజీ శంఖబ్రత బాగ్చి నంద్యాల చేరుకున్నారు. నంద్యాలలో కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఐజీ దర్యాప్తు చేయనున్నారు. ఈనెల 3న కౌలూరు దగ్గర రైలుకిందపడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఐజీ శంఖబ్రత బాగ్చి నంద్యాల చేరుకున్నారు. నంద్యాలలో కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఐజీ దర్యాప్తు చేయనున్నారు. ఈనెల 3న కౌలూరు దగ్గర రైలుకిందపడి అబ్దుల్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ‘పోలీసుల టార్చర్‌ భరించలేకపోతున్నా. అందుకే కుటుంబంతోసహా ఆత్మహత్య చేసుకుంటున్నా..’ ఈనెల 3న గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలివి!. అబ్దుల్‌ సలాం (45).. భార్య నూర్జహాన్‌ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలందర్‌ (10)తో కలిసి పాణ్యం మండలం కౌలూరు వద్ద గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నంద్యాల ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీని నియమించారు. ఇద్దరు ఐపీఎస్‌లతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ సభ్యులుగా ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీ శంకబ్రత బాగ్చి, గుంటూరు అదనపు ఎస్పీ ఆరీఫ్‌గా నియమించారు. విచారణ పూర్తయ్యే వరకు నంద్యాల వన్ టౌన్ సీఐ సోమ శేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు చేశారు. 

Updated Date - 2020-11-08T21:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising