ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం అంబులెన్స్‌లు ప్రారంభిస్తే.. ఆ ఫీలింగ్ కలిగింది: పట్టాభిరాం

ABN, First Publish Date - 2020-07-01T17:42:35+05:30

ఏ1, ఏ2ల అవినాభావ సంబంధాన్ని మరింత బలపర్చుకోవడం కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏ1, ఏ2ల అవినాభావ సంబంధాన్ని మరింత బలపర్చుకోవడం కోసం విజయసాయి రెడ్డి పుట్టిన రోజును సీఎం జగన్ చాలా గొప్పగా.. ప్రపంచమంతా ఆశ్చర్యపోయేవిధంగా జెండా ఊపి అంబులెన్సులు ప్రారంభించారని టీడీపీ నేత పట్టాభిరాం విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అంబులెన్సులు రోడ్డుపై వెళుతుంటే... విజయసాయి ఇంటికి రూ. 307 కోట్లు తరలి వెళుతున్నంత ఫీలింగ్ కలుగుతోందన్నారు. ఇలాంటి గొప్ప గొప్ప పనులు ముఖ్యమంత్రికే సాధ్యమవుతాయని ఎద్దేవా చేశారు. తాము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. కోట్ల రూపాయలు అడ్వటైజ్‌మెంట్లకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన అడిగిన ప్రశ్నలకు ఈరోజు వరకు సమాధానం ఎందుకు చెప్పలేకపోయారని ఆళ్లనాని, జవహర్‌రెడ్డిలను ఉద్దేశించి పట్టాభిరాం ప్రశ్నించారు.


డిసెంబర్ 2020 వరకు కాంట్రాక్ట్ అమలులో ఉండగా బీవీజీ సంస్థకు ఏ కారణంతో తప్పించారని పట్టాభిరాం ప్రశ్నించారు. ఎలాంటి అనుభవం లేని అరబిందో సంస్థకు అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ కట్టబెట్టడానికి జ్యుడిషియల్ రివ్యూలో క్లాజ్‌లను ఎందుకు మార్చారో సమాధానం చెప్పలేదని... ఈ విధంగా తాము అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. వాస్తవాలు దాచారని పట్టాభిరాం తీవ్రస్థాయిలో విమర్శించారు.


Updated Date - 2020-07-01T17:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising