ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై హైపర్ కమిటీ విచారణ

ABN, First Publish Date - 2020-06-07T17:49:56+05:30

నగరంలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై హైపవర్ కమిటీ ఆదివారం విచారణ జరుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై హైపవర్ కమిటీ ఆదివారం విచారణ జరుపుతోంది. రాజకీయపార్టీల నేతలు, స్థానికులతో వేర్వేరుగా సమావేశం నిర్వహిస్తోంది. హైపవర్ కమిటీ ఎదుట వాదనలు వినిపించేందుకు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుడు కనకరాజు భార్య లావణ్య అక్కడికి వచ్చారు. అయితే లిస్టులో పేరు లేదంటూ ఆమెను అనుమతించలేదు. సుమారు గంటపాటు గేటు వద్ద లావణ్య నిలబడడంతో స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.


విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో మే 7వ తేదీన సంభవించిన స్లైరిన్ లీకేజీకి బాధ్యులు ఎవరన్న అంశంపై విచారణ జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలోని హైపర్ కమిటీ శనివారం విశాఖలోని ఓ హోటల్లో సమావేశమైంది. ప్రమాదానికి దారితీసిన అంశాలపై సాంకేతిక కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను కమిటీ అధ్యయనం చేసింది. పరిశ్రమలోని ట్యాంకులు, యంత్రాల్లోని లోపాలు, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నతస్థాయిలో పర్యవేక్షణ లోపం, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవడం, ఉద్యోగుల్లో నైపుణ్యం కొరత, ప్రమాదం అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనారాహిత్యం తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. 

Updated Date - 2020-06-07T17:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising