ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెన్‌కోలో భారీగా బదిలీలు

ABN, First Publish Date - 2020-06-22T09:23:56+05:30

రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ జెన్‌కోలో భారీగా బదిలీలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ జెన్‌కోలో భారీగా బదిలీలు చేపట్టారు. ఈ మేరకు సంస్థ ఎండీ బి.శ్రీధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. మిగులు ఉన్న చోట నుంచి తక్కువ ఉన్న చోట్లకు అధికారులు, సిబ్బందిని బదిలీ చేశారు. అమల్లో ఉన్న విధానం ప్రకారం ప్రతి పది మెగావాట్ల సామర్థ్యానికి ఎనిమిది మంది సిబ్బంది ఉండాలని, కానీ, రాయలసీమ థర్మల్‌ కేంద్రంలో 10.3, విజయవాడ థర్మల్‌ కేంద్రంలో 10.28 మంది చొప్పున ఉన్నారని తెలిపారు. అందువల్ల వీటి నుంచి కొందరు సిబ్బందిని కొత్త యూనిట్ల నిర్మాణం జరుగుతున్న చోట్లకు బదిలీ చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాయలసీమ థర్మల్‌ కేంద్రం నుంచి 282 మందిని, విజయవాడ థర్మల్‌ కేంద్రం నుంచి 55 మందిని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రానికి బదిలీ చేశారు. వీటీపీఎస్‌ నుంచి మరో 264 మందిని అక్కడే కొత్తగా నిర్మిస్తున్న ఐదో దశ 800 మెగావాట్ల యూనిట్‌కు బదిలీ చేశారు. సీనియారిటీ సమస్యలు లేకుండా వీరిని డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

Updated Date - 2020-06-22T09:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising