‘ఇళ్ల’ నిరసన సెగలు
ABN, First Publish Date - 2020-12-29T08:25:22+05:30
ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అర్హులకు అన్యా యం జరుగుతోందంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
- పట్టాలు అందక బాధితుల ఆందోళనలు
- కడప తహసీల్దార్ కార్యాలయ ముట్టడి
(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్): ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అర్హులకు అన్యా యం జరుగుతోందంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల కే కేటాయిస్తున్నారంటూ బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంటి పట్టాలకు మేము అర్హులం కాదా’ అంటూ కడప జిల్లా రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవా రం మహిళలు చుట్టుముట్టారు. ఇంటి పట్టాలు మంజూరయ్యాయంటూ రైల్వేకోడూరు పట్టణానికి చెందిన మహిళలకు వలంటీర్లు కూపన్లు కూడా పంపిణీ చేశారు. అయితే ఆ పట్టాలు రాలేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన మహిళలు భారీ ఎత్తున తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో పట్టాల పంపిణీ వద్దకు రాకపోవడం, పట్టాలను నిలుపుదల చేసినట్టు తహశీల్దార్ వివరించారు. కూపన్లు వచ్చిన మహిళలకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరులో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులకే ఇళ్లు కేటాయిస్తున్నారని, రాత్రికి రాత్రే తమ పేర్లు తొలగించారని పలువురు మహిళలు వేదిక వద్ద ఆందోళన చేశారు.
గత టీడీపీ పాలనలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వగా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకొందంటూ కర్నూలు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట హిజ్రాలు ఆందోళన నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలో 2018లో 800 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఆ లబ్ధిదారుల్లో 21 మంది హిజ్రాలు కూడా ఉన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ పట్టాలన్నింటినీ రద్దు చేసి, అదే స్థలంలో 703 మంది లబ్ధిదారులకు కొత్తగా ప ట్టాలు మంజూరు చేసింది. ఈ నెల 25న వా టిని పంపిణీ చేశారు. ఈ ప్రక్రియలో ఆ 21 మంది హిజ్రాలకు ఇళ్లపట్టాలు మంజూరు చేయలేదు. దీంతో వారంతా పట్టాల పంపిణీ రోజే ఆందోళనకు సిద్ధమవగా, మరుసటి రోజు పట్టాలు ఇస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతలు వారికి సర్దిచెప్పి పంపారు. తర్వాతి రో జు తమకు తెలియదని చెప్పారు. దీంతో ఆ హిజ్రాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. రాత్రివరకు చప్పట్లు కొడుతూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ ప్రకాశ్‌బాబును వివరణ కోరగా, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోవడం వల్ల ఇవ్వలేకపోయామని, ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటే 90రోజుల్లో ఇంటిపట్టాలు ఇస్తామన్నారు. ఇక కృష్ణాజిల్లా విజయవాడలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రాక కోసం లబ్ధిదారులు 6.30 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.
‘పట్టా’ రాలేదు.. ప్రాణం పోయింది..
రెండుసార్లు ప్రకటించిన లబ్ధిదారుల జాబితాల్లో త న పేరు ఉన్నా, ఇంటి స్థ లం పట్టా ఇవ్వలేదని మనస్తాపంతో పురుగుమందు తాగిన వ్యవసాయ కూలీ అంబటి శ్రీనివాసరావు(52) తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట ఎస్సీకాలనీకి చెందిన శ్రీనివాసరావు శనివారం పట్టాల పంపిణీ జరిగిన ప్రదేశంలోనే పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవా రం ఆయన ప్రాణాలు విడిచారు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోగా, ఒక్కగానొక్క కుమార్తెను అన్నీ తానై ఆయన పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా మరణించడంతో ఇంటర్మీడియెట్ చదువుతున్న కుమార్తె అనాథగా మిగిలింది.
Updated Date - 2020-12-29T08:25:22+05:30 IST